Thursday, April 11, 2013

విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఆనందాన్ని పెంచుకుంటూ ... 
భాదలని పంచుకుంటూ ... 
కోపం, ద్వేషంను ప్రేమనురాగంగా మార్చుకుంటూ ... 
నిర్భయంగా నిలిచి 
అపజయాలను విజయ సోపానాలుగా మలచి ... 
ఈ విజయ నామ సంవత్సర యుగాది మీకు తృప్తి, శాంతి, సౌక్యమ్ సమకూర్చాలని ఆశిస్తూ ... 
మీకు మీ వారందరికీ ఉగాది శుభాకాంక్షలు 

Sunday, July 8, 2012

అనాగరికం ... నా ఈ భారతం



అనాగరిక సమాజం ఆకృత్యాలకు అద్దం ఈ లఘు చిత్రం 
View this movie at cultureunplugged.com

Thursday, March 22, 2012

ఉగాది శుభాకాంక్షలు

మమకారం నిండిన ప్రేమలతో
పుల్లని చెలిమి చిలిపి తగవులతో
చేదు జ్ఞాపకాల అనుభవాల సారంతో
రేపటి భయాన్ని చేదించే పొగరు ఒగరుతో
తియ్యని విజయ తీరాలు చేరుకునేందుకు
ఉప్పొంగే జీవన స్రవంతిలా
షడ్రుచుల సమ్మేళనంగా సాగే వసుదైక కుటుంబం అవుదాము....

మీ అందరికి నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Thursday, January 19, 2012

నీ చూపు నను తాకిన క్షణం.....

చిగురుటాకులపై తొలి రవి కిరణం ముద్దు హిమబిందువైన వేళ…
సిగ్గరి నింగి ఎర్రని మబ్బుల ముగ్గులతో ముస్తాబైన క్షణం...
నీ పాదాల పారాణి పరికిణీ అంచులతో దోబూచులాడుతుంటే...
నీ మునివేళ్ళ నుంచి జాలువారుతున్న రంగవల్లి హరివిల్లయ్యే క్షణం...
నీ ముంగురుల చాటునుంచి నీ క్రీగంటి చూపు  నను తాకిన క్షణం .... తొలి వలపుల ప్రేమ

తోరణాల పందిరి ముస్తాబుల నడుమ 
సన్నాయి మేళాలు, వేద మంత్రాలు, ఆత్మీయుల ఆశీస్సుల సాక్షిగా 
నిను నా దానిని చేసుకున్న వేళ...
రాలే తలంబ్రాల చాటు నుంచి నీ చూపులు నను తాకిన క్షణం .... జీవన ప్రయాణానికి నా ప్రమాణం 

కోయిలలు కుహూ కుహూ రాగాల జావళీలు పాడగా
సప్త వర్ణాలతో రంగరించిన ప్రకృతి అందాలు కనుల విందు చేయగా 
వెన్నెల రాత్రిన చుక్కలు చంద్రునితో సరసమాడే క్షణం 
నీ మోము నా చేతుల నడుమ చంద్రబింబమై 
నీ బుగ్గల ఎరుపు మెరుపై నను మరిపించగా
మెరిసే నీ పెదవులను ముద్దాడిన నను నీ కొంటె చూపు తాకిన క్షణం ... మధుర ప్రణయం 

నా చేతిలో చేయి వేసి సాగించిన ప్రయాణం చివరి మజిలీ
మన ప్రేమ తలపులు కన్నీరై నేల రాలుతున్న క్షణం 
మూతపడుతున్న రెప్పల నడుమ నీ చివరి చూపు నను తాకిన క్షణం ... ప్రళయం ... అది నా మరణం 

Friday, July 22, 2011

రమణ గారికి ఓ అభిమాని నివాళి ...

నాకు ఎంతో నచ్చి ఇక్కడ పొందు పరుస్తున్నాను 
రమణగారండోయ్... చిన్నమాట!!


ఆ రచయత్రికి నా సందేశం ....
ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు...ప్రతిసారి కంట తడి .... అయినా "ఏ కన్నీరు యనక ఏముందో" అన్నట్టుగా నా కన్నీరు వెనక కాస్త బాద కాస్త సంతోషం....
అంతోటి రమణ గారు లేరని బాధ ... లేదు లేదు ఇంతోటి అభిమానం ఉంటె అయన మనతోనే ఉంటాడని, మన లోనే ఉన్నాడని నమ్మకంతో చిన్న ఆనందం ....
మీ పద నివాలికి ఏమి ఇస్తే సరిపోతుంది... "మా" రమణ గారిని "మీ" రమణ గారే అనేదామని ఉన్న .. (తెలుసుగా మీకు ఎంత కష్టమో) మన రమణ గారి ఆశీస్సులు 
మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... 

హిమ సాగర్

Saturday, May 14, 2011

మన మంచి ఆ పాత మధురాలు

చిమట పాటల సంకలనం


ఆ మధురాల సాహితి సుధాదార 
యుగళగీతం (సుధారాణి గారి కలం నుంచి)

Sunday, January 30, 2011

నిను వీడి నేనుండగలనా ...

ప్రియ ....
నిన్ను నా కళ్ళలో దాచుకొందామనుకుంటే కన్నీరై వీడిపోతావని భయం
నిన్ను నా శ్వాసగా మార్చి దాచుకొందమనుకొంటే నిశ్వాసలో దూరమౌతావని భయం
నిన్ను నా హృదయం లో దాచుకొందమనుకొంటే బాదలో కరిగిపోతావని భయం
నిన్ను నా నీడగా మార్చి దాచుకొందమనుకొంటే చీకటి వెలుగులు నిన్ను నా చెంత చేరనివ్వవని భయం
నిన్ను నా ఉత్సహం గా మలచి దాచుకొందమనుకొంటే నిరుత్సాహం లో నీ దరి చేరలేనని భయం
నీ ఊహలో ఉందమనుకొంటే  వాస్తవం లో వదలిపోతావని భయం
నా భయం ... నా ధైర్యం .... నీవే అందుకే నీవే నేనై నిలిచి ఉన్నా ......