Thursday, December 2, 2010

వీడుకోలు.....

నా గుండె సడి ప్రతి నిమిషం ప్రేమను జపించి తపించి అలసిపోయింది ...
నమ్మలేని నా కళ్ళను నమ్మించాలి, నీవు ఎప్పటికి తిరిగిరాని ఓ కలవని ...
కానరాని వసంతుడికై  పాటలు పాడి మూగవోయిన కోయిలలా ...
ఆగని పైరగాలిని ఆపలేక నిరాశతో నిశ్చలంగా ఉన్న పచ్చికలా ....
అందని నింగికై  ఎగసి ఎగసి అలసి సొలసిన కడలి అలలా ...
పగిలిన గుండె ముక్కలని నిస్సహాయంగా చూస్తూ,
    ఆగని కన్నీరును సిరాగా మార్చి వ్రాస్తున్న వీడుకోలు ...
నీతో నడవాలని పరితపించి ముందుకు సాగానంటున్న నా అడుగుల తడబాటును
    నీ పరిచయం లో
నే చేసిన పొరబాట్లను మన్నించు ...
ప్రేమ నిండిన ఈ లోకం నా ప్రేమ వెలితి నీకు తెలియ నివ్వరాదని కూరుకుంటూ ...
నీవు లేని నేను ....

Tuesday, November 16, 2010

నా కవితలు





తొలకరి చినుకుల పలకరింపులు ....
నీ పెదవిపై చేరి ముత్యమయి ... మురిపెమయి నను తాకగా...
ముత్యమంత ముద్దులా .... ముత్యాల ముగ్గులా ...
నా మదిలో చెరగని ముద్ర వేసావు .....
ఓ చినదానా ...
ఆ చినుకుకు చెప్పనా ....
చెరగని గుర్తుకు చెప్పనా ....
నా చెంతన ఉన్న నీకు చెప్పనా ...
నాలో ఉన్న నా నీతో చెప్పనా ...
ఈ ఆనందం ... ఈ హుషారు ...
స రి గ మ ప ద ని సప్త స్వరాలూ ... నా మది పాటనే పాడుతుంటే ....
రెప్పదాటని స్వప్న సుమహారం నీ ప్రేమ లా కనపడుతోందే ....
ఓ బాపు బొమ్మ ...
చెరగని నీ చిరునవ్వు నా చిరునామా అవ్వాలని కోరుకుంటూ
నీ నేను ...

నా కవితలు...

చిరునవ్వుల సడి కలంగా

హరివిల్లు రంగులు కథనంగా
నింగి తారకలు భావంగా
అనంత విశ్వం మాటలుగా
ప్రేమ నా పాటగా
కలల వొడిలోని కంటి పాపకు
మౌనముగా నా మనసు తో జోల పాడుతూ నిలిచి ఉన్న

నా కవితలు


కురిసే పూలజల్లు నను తడిమే నీ చేతి స్పర్శలా ఉంది....
నను తడిపే ప్రతి చినుకు నీ ప్రేమ జడి లా ఉంది...
వీచే పైర గాలి నా బుగ్గ పై నీ ముద్దులా ఉంది...
ముసుగు తెరలను తొలచి నను తాకే తొలి రవి కిరణం అక్కున చేర్చుకున్న నీ కౌగిలి వెచ్చదనంలా ఉంది...
వినిపించే ప్రతి సడి నీ లాలి లా ఉంది....
నింగి లో చుక్కలన్నీ నీ చేతి నుండి రాలే తలంబ్రాలు గా నన్ను మురిపిస్తున్నాయి...
నువ్వు నా దరి లేవని గుర్తురానివ్వని ఈ ప్రకృతి పై అలగకు ప్రియా....
నా లో ఉన్న నీ మాయే ఇది అని నీకు చెప్పమని ఆ వసంతుడిని అడిగా.....

వీచే గాలులు...
పూచే పువ్వులు...
ఎగిరే గువ్వలు ....
వెన్నెల రాత్రులు ...
మరుమల్లెల సువాసనలు ....
నవ్వితే రాలే నీ నోటి ముతయాలని ఆగి చూడు....
నీ చుట్టూ ఆనందాన్ని నింపాలని ప్రయత్నించే నేను లా ఉంటా....

నీ నేను ....

నా కవితలు...



వెడలిపోతున్న నీ అడుగుల రూపం కనపడటం లేదు
నువ్వు దూరం వెళ్ళిపోయావు అనుకుంటుంది మనసు
పిచ్చిది ..... నీ రెండడుగుల దూరం మిగిలిచిన కన్నీటి పొర కారణం అని ఎలా చెప్పేది..